ఓటిటి బిజినెస్ లో కూడా క్రాక్ అదరకొట్టిందిగా…!

  • January 30, 2021 / 01:14 PM IST

‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం క్రాక్. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటించింది. గత 3 ఏళ్లుగా సరైన హిట్టు లేని రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అతను వన్ మ్యాన్ షో చేసేశాడు ఈ చిత్రంలో..! ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. నిజానికి విడుదలకు ముందు క్రాక్ సినిమా పై అనుమానాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని, రవితేజ లు ఫ్లోపుల్లో ఉండటం .. పైగా 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో కలెక్షన్లు వస్తాయా అంటూ చాలా అనుమానాలే నెలకొన్నాయి. ఇక విడుదల తర్వాత అవన్నీ పటా పంచలు అయిపోయాయి.

ఇక ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను కూడా ఆహా వారు ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం.. క్రాక్ విడుదలైన తరువాత ఆహా టీం ఈ చిత్రాన్ని 8కోట్లకు కొనుగోలు చేశారట. నిజానికి జనవరి ఎండింగ్ లోనే ఈ చిత్రాన్ని ఆహా లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ ల కోరిక మేరకు ఫిబ్రవరి 5 కి పోస్ట్ పోన్ చేశారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus