Savitri: ఆ విషయంలో సావిత్రి తప్పు చేశారన్న కృష్ణ కుమారి!

తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో సావిత్రి ఒకరు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న సావిత్రి నాటకాల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. పెదనాన్న ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన సావిత్రి నటిగా అంతకంతకూ ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో సావిత్రి సెకండ్ హీరోయిన్ రోల్స్ లో, చిన్న పాత్రలలో నటించి మెప్పించారు. సావిత్రి నటించిన సినిమాలు తమిళంలో కూడా సక్సెస్ సాధించడంతో ఆమెకు మహానటిగా పేరుప్రఖ్యాతులు లభించాయి.

సావిత్రి చిన్నారి పాపలు అనే సినిమాకు డైరెక్షన్ చేశారు. చిన్నారి పాపలు సినిమా పూర్తిగా మహిళల చేత నిర్మించబడిన సినిమా కావడం గమనార్హం. సావిత్రిది ఎడమచేతివాటం కాగా వర్షం, మల్లెపూలు సావిత్రికి ఎంతో ఇష్టమైనవి. సావిత్రి ఇతరులను అనుకరించడంలో కూడా ముందువరసలో ఉండేవారు. ప్రముఖ నటి కృష్ణకుమారి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి జీవితంలో చివరి రోజుల్లో ఆ విధంగా కావడంతో చాలా కోపం వచ్చిందని అన్నారు. సావిత్రి చాలా పెద్ద హీరోయిన్ అని ఆమె ఇంటెలిజెన్స్ ఏమైందని కృష్ణకుమారి ప్రశ్నించారు.

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగజారిపోకూడదు కదా అంటూ ఆమె కామెంట్లు చేశారు. ఆ కారణం వల్లే సావిత్రి చనిపోతే చూడటానికి వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో కృష్ణకుమారి వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2018 సంవత్సరం జనవరి నెల 24వ తేదీన కృష్ణకుమారి కన్నుమూశారు.

16 సంవత్సరాల వయస్సులోనే కృష్ణకుమారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెకు ఫ్లాపుల హీరోయిన్ అని పేరు వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లక్షాధికారి అనే సినిమాలో ఆమె స్విమ్మింగ్ క్యాస్టూమ్ ధరించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus