వర్మ తీసిన సినిమాని సమర్ధించిన కృష్ణంరాజు

కొన్ని పనులు మొదట వ్యతిరేకించబడతాయి… తర్వాత సమర్థించబడతాయి.. ఆ తర్వాత ఆమోదించబడతాయి… అని ఒక నానుడి ఉంది. వర్మ చేసే పనులు కూడా అలాంటి కోవకే చెందుతాయి. అతను శివ సినిమా మొదటి షాట్ తీసేటప్పటి నుంచి విమర్శలను ఎదుర్కుంటున్నారు. వాటన్నింటికి తన సినిమా హిట్స్ తో సమాధానం చెప్పిన వర్మ మరో సారి సంచలన అడుగు వేశారు. పోర్న్ స్టార్ తో సినిమా తీసి అన్ని వైపులా నుంచి విమర్శలను ఎదుర్కుంటున్నారు. ఆయన తీస్తున్న “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” చిత్రం పై ప్రజల్లోనే కాదు, ఇండస్ట్రీ లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది వర్మపై విమర్శలు చేస్తూ ఉండగా మరి కొంత మంది సమర్థిస్తున్నారు. వర్మని తిట్టి పొసే వర్గంలో అనేక మహిళా సంఘాలు ఉండగా… సమర్ధించే వారిలో కత్తి మహేష్, కృష్ణం రాజు ఉన్నారు. కృష్ణం రాజుని వర్మ తీస్తున్న ఈ చిత్రం పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. ఇలా స్పందించారు.

” బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ఇప్పుడు మన సినిమాలను అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులు చూస్తున్నారు. కాబట్టి, ఇప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడం తప్పక అవసరం అవుతుంది. తీయనివ్వండి చూద్దాం ” అన్నారు. అందరూ అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీస్తుంటే వర్మ మాత్రం పోర్న్ సినిమాలు చెయ్యడం ఏంటి ? ” అని ఓ విలేఖరి ప్రశ్నించగా అందుకు కృష్ణం రాజు ఘాటుగానే స్పందించారు. “వర్మ సినిమాలు నచ్చకపోతే చూడకండి. సింపుల్. అయినా ఆయన సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారా ? లేదా ఆయన సినిమాలు చూడకుండా బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారా ? ఆయనేది చేసినా సిన్సియర్ గా చేస్తారు. కాబట్టి వర్మ సినిమా వచ్చే దాకా వేచి చూద్దాం ” అని అన్నారు. కృష్ణంరాజు మాటలకు మహిళా సంఘాలే కాదు.. టాలీవుడ్ వర్గాలు షాక్ కి గురయ్యాయి. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus