Krithi Shetty: దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేసిన కృతి శెట్టి!

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయినటువంటి కృతి శెట్టి అనంతరం నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టికి వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడుతున్నాయి. ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతున్న కృతి శెట్టి నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా ఈమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే దివారియర్,మాచర్ల నియోజకవర్గం వంటి రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమె గుళ్ళు గోపురాలు తిరుగుతూ తన సినిమాల కోసం పూజలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కృతి శెట్టి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈమె జాతకంలో దోషం ఉందని ఆ దోష ప్రభావం వల్లే తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయని తెలియడంతో ఈమె ఆలయానికి వెళ్లి దోష నివారణ పూజలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ దోష నివారణ పూజా కార్యక్రమాలలో భాగంగా ఈమె తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించిందని సమాచారం. కృతి శెట్టి నటించిన సినిమాలు వరుసగా హిట్ కావడంతో తనపై అందరి చూపు తనపై పడటం వల్ల దిష్టి తగిలిందని ఆమె సన్నిహితులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈమె గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఇప్పటికీ కూడా ఇలాంటి వాటిని నమ్మే వాళ్ళు ఉంటారా…

ఇలాంటివన్నీ కేవలం మూడు నమ్మకాలు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు.అయితే ఈమె నటించిన ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కృతి శెట్టి కాస్త ఆందోళనగానే ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా తనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus