Krithi Shetty: మరో రెండు ప్రాజెక్టులకి సైన్ చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి..!

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.. కానీ ఆమె తొందరపడి వేటికి ఓకే చెప్పడం లేదు. ‘ప్రస్తుతం సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’,రామ్-లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ… వంటి ప్రాజెక్టుల్లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. దీని తర్వాత చాలా ప్రాజెక్టుల్లో కృతి శెట్టి ఎంపికైనట్టు ప్రచారం జరిగింది కానీ..

వాటిలో నిజం లేదని ఆమె తేల్చి చెప్పేసింది. అంతేకాదు ‘తర్వాత నటించబోయే ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను స్వయంగా నేనే ప్రకటిస్తాను’ అంటూ కూడా కృతి శెట్టి తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా కృతి శెట్టి మరో రెండు ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వివరాల్లోకి వెళితే…త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ లో కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆమె నాగ చైతన్య సరసన నటించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కూడా కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపికైందట. వీటిలో ఆమె ఒక్కో సినిమాకి గాను రూ.75 లక్షల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ‘ఉప్పెన’ తర్వాత ఈమె ఒప్పుకున్న 3 సినిమాలకి రూ.60 లక్షల చొప్పున పారితోషికం అందుకోగా ఇప్పుడది రూ.75 లక్షలకి చేరుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus