ఆ మధ్య కొన్ని నెలల క్రితం ఓ బాలీవుడ్ హీరోయిన్ ఓ దెయ్యం సినిమా చేసింది. ఆ సినిమా ప్రచారంలో భాగంగా బయటకు వచ్చినప్పుడు ‘గతంలో ఎప్పుడైనా మీకు ఇలాంటి భయపడే అనుభవం ఎదురైందా?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఓ సినిమా షూటింగ్ చేసినప్పుడు హైదరాబాద్‌లో ఇబ్బందిపడ్డాను. పరిస్థితుల చూసి భయమేసింది అని వివరంగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలు నీట్‌గా చెప్పేసింది. అయితే ఆ తర్వాత పెద్ద రచ్చ అవుతుండేసరికి.. ఆ ప్లేస్ నాకు బాగా ఇష్టమని చెప్పి కాంట్రవర్శీకి ఎండ్ కార్డ్ వేసింది.
అయితే, మళ్లీ ఏమైందో ఏమో మరోసారి ఆ పరిస్థితుల గురించి, ఆ ప్రదేశం గురించి మరోసారి ప్రస్తావించింది. అయితే ఈసారి ఆమె డైరెక్ట్‌గా ఆ ప్లేస్ గురించి చెప్పలేదు. ఆ సినిమాలో ఆమెతోపాటు కలసి నటించిన హీరోయిన్ ఈసారి మాట్లాడింది. ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు కలసి ప్రైమ్ వీడియోలో ఓ టాక్ షో చేస్తున్నారు. అందులో ఈ వారం గెస్టులుగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ కృతి సనన్ వచ్చారు. అక్కడే ఈ టాపిక్ డిస్కషన్‌కి వచ్చింది.
సినిమా షూటింగ్ సమయంలో నీకెదురైన ఇబ్బందికరమైన పరిస్థితి గురించి చెబుతావా అని హోస్ట్‌లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ అడిగితే.. అప్పుడు కృతి ‘దిల్ వాలే’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. పైగా నిజమే కదా అంటూ కాజోల్‌ని చూసి అడిగింది. దానికి ఆమె కూడా అవును అని చెప్పింది. ఇంతకీ కృతి ఏం చెప్పిందంటే.. ‘దిల్ వాలే’ సినిమా షూటింగ్ సమయంలో ఓ హోటల్‌లో ఉన్నప్పుడు తన టీమ్‌లో ఒకరికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని, ఎవరో వెనుక నుండి టచ్ చేస్తున్నట్లుగా అనిపించింది అని కృతి చెప్పింది. అలాగే మేకప్ సామాన్లు ఎవరూ టచ్ చేయకుండా కింద పడటం లాంటివి జరిగాయి అని చెప్పింది. ఆ ప్లేస్ ఏంటి అనేది ఆమె చెప్పలేదు.