Kriti Sanon: ప్రభాస్ విషయంలో అవి నిజం కాదట!

  • August 31, 2021 / 12:06 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, కృతిసనన్ కాంబినేషన్ లో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండటం గమనార్హం. తాజాగా ఈ సినిమా గురించి కృతి సనన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఆదిపురుష్ షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశానని మా జోడీ తెరపై బాగుంటుందని ఆమె అన్నారు.

ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని ప్రభాస్ కు వినయం ఎక్కువని కృతిసనన్ పేర్కొన్నారు. ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ తనకు చాలా నచ్చిందని ప్రభాస్ కంఫర్టబుల్ గా ఫీలైతే బాగా మాట్లాడతారని కృతి సనన్ వెల్లడించారు. ప్రభాస్ అందరితో చాలా సరదాగా ఉంటారని కృతి చెప్పుకొచ్చారు. కృతిసనన్ ప్రభాస్ ను వెనుకేసుకొని రావడంతో పాటు ప్రభాస్ కు బిడియం ఎక్కువని జరిగిన ప్రచారంలో నిజం లేదని వెల్లడించారు. భారీ బడ్జెట్ తో టీ సిరీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ మూవీ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ మూవీ కాగా వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రభాస్ కృతిసనన్ నాలుగు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. బాలీవుడ్ నటి కాజోల్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus