విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత లు హీరోయిన్లుగా … నయన్ తార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కె.ఆర్.కె'(‘కన్మణి రాంబో కటీజా’). తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో నోరు తిరగలేని పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. విజయ్ సేతుపతి తెలుగులో మంచి విలన్ గా, సహాయ నటుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు కానీ హీరోగా అతన్ని ఇక్కడి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసింది లేదు.
ఇక నయనతార ఇమేజ్ కూడా ఇక్కడ అంతంత మాత్రమే. అయితే సమంత వల్ల ఈ చిత్రం పై మంచి బజ్ ఏర్పడింది.ఆమె వల్లే ఇక్కడ ఆ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.అందులోనూ సమంత పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ బిలో యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ఇక్కడ ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా మొదటి రోజు ఓకే అనిపించిన ఈ మూవీ వీకెండ్ వరకు ఆ జోష్ ను కంటిన్యూ చేయలేకపోయింది.
కానీ నిన్న రంజాన్ సెలవు కలిసి రావడంతో కొన్ని ఏరియాల్లో పర్వాలేదు అనిపించేలా కలెక్ట్ చేసింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.42 cr
సీడెడ్
0.21 cr
ఉత్తరాంధ్ర
0.16 cr
ఈస్ట్ + వెస్ట్
0.12 cr
గుంటూరు + కృష్ణా
0.14 cr
నెల్లూరు
0.08 cr
ఏపి+తెలంగాణ
1.13 cr
‘కన్మణి రాంబో కటీజా’ చిత్రానికి రూ.2.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.13 కోట్ల షేర్ ను నమోదు చేసింది. జీఎస్టీ కాకుండా వచ్చిన షేర్ ఇదని ట్రేడ్ పండితుల సమాచారం. అది తీసేస్తే రూ 0.90 కోట్ల షేర్ గా ఉంటుంది అనేది అంచనా.
‘ఆచార్య’ రిలీజ్ అవ్వడంతో ఈ చిత్రానికి థియేటర్లు తగ్గాయి. లేదంటే మరింతగా కలెక్ట్ చేసి ఉండేది.అయినప్పటికీ నిన్న రంజాన్ హాలిడే ఈ మూవీకి కొంతవరకు కలిసొచ్చింది అని చెప్పాలి.