Kubera: ధనుష్- నాగ్..ల ‘కుబేర’ మరింత ఆలస్యం.. ఏమైందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కుబేర’ (Kubera) . శేఖర్ కమ్ముల (Sekhar Kammula)  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna)  కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన (Rashmika Mandanna) ధనుష్ కి జోడీగా నటిస్తోంది. ‘ఏషియన్’ ‘అమిగోస్’ క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ధనవంతుడైన హీరో.. తర్వాత డబ్బు పోగొట్టుకుని ఫుట్ పాత్ మీదకు వెళ్లిపోవడం… తిరిగి ధనవంతుడు అవ్వడం’ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

Kubera

దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్ లుక్స్ వైవిధ్యంగా అనిపించాయి. ‘లవ్ స్టోరీ’ (Love Story) 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. దీని రిలీజ్ డేట్ కోసం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మొదట ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఫిబ్రవరిలో నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

దీంతో ‘కుబేర’ నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పైగా షూటింగ్ కూడా కొంత భాగం పెండింగ్లో ఉంది. అది పూర్తయ్యేసరికి టైం పట్టొచ్చు. మరోపక్క మార్చి నెలలో కూడా బోలెడన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కూడా ‘విశ్వంభర’ (Vishwambhara) వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి.. జూన్ నెలలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని భావించి ‘కుబేర’ ని అప్పటికి పోస్ట్ పోన్ చేస్తున్నారట మేకర్స్.త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus