ఖుష్బూ టార్గెట్ చేసింది ‘శ్రుతి హసన్నే’నా?

తమిళ సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది…ఎవరికి వారు తమ తమ రేంజ్ ని బట్టి తమ స్టైల్ ని బట్టి విమర్శలు చేసేస్తూ ఉంటారు. అయితే అందులో ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్ అని ప్రత్యేకంగా చెప్పలేం కానీ…ఈ గొడవల గోల మాత్రం చూసే వాళ్ళకి వినే వాళ్ళకి మంచి కిక్ ఇస్తుంది…టైమ్ పాస్ కూడానూ…అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే…ప్రముఖ దర్శకుడు సుందర్ సీ…దర్శకత్వం వహిస్తున్న  ‘సంఘమిత్ర’ సినిమాలో శ్రుతి హసన్ నటించాల్సి ఉంది…అయితే బౌండ్‌ స్క్రిప్ట్‌ ఇవ్వని కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నానని శ్రుతీ ఎప్పుడో తెలిపింది…ఆ కధ అక్కడికి అయిపోయింది అని అనుకున్నారు అందరూ…కానీ అసలు కధ అక్కడే మొదలయింది అని ఇప్పుడే అర్ధం అయ్యింది…మ్యాటర్ లోకి వెళితే…శ్రుతి చేసిన పనికి ట్విటర్ ద్వారా సమాధానం చెప్పింది ప్రముఖ నటి, దర్శకుడు సుందర్‌. సి సతీమణి ఖుష్బూ…ఎక్కడా శ్రుతీ పేరు వాడకుండా…వాతలు పెట్టేసింది.

అసలు ఆమె ఏమంది అంటే…‘‘సరైన ప్లానింగ్‌ లేకుండా ‘సంఘమిత్ర’ వంటి భారీ బడ్జెట్‌ సినిమా తీయలేం. ఎవరో ‘సంఘమిత్ర’ స్క్రిప్ట్‌ రెడీ కాలేదంటూ ఆరోపణలు చేయడం విన్నా. గత రెండేళ్లుగా ఈ సినిమా వర్క్‌ జరుగుతోంది. నాన్–ప్రొఫెషనల్స్‌కి అది అర్థం కాదు. ‘సంఘమిత్ర’ వంటి సినిమాలకు షూటింగ్‌ అనేది 30 శాతం మాత్రమే. షూటింగ్‌కి ముందే 70 శాతం వర్క్‌ పూర్తవుతుంది’’ అని సుతి మెత్తని మాటలతో శృతికి కౌంటర్ ఇచ్చింది…అంతేకాకుండా…అక్కడితో ఆగకుండా…‘‘ఓ లెగస్సీ కొనసాగిస్తున్న వారినుంచి కొంచెం ప్రొఫెషనలిజమ్‌ ఆశించా. నీ తప్పులను హుందాగా అంగీకరిస్తే, ఇంకా ఎంతో దూరం వెళ్తావు’’ అంటూ సైలెంట్ గా కిల్ చేసేసారు ఖుష్బూ. అయితే దీనిపై శ్రుతి ఏమీ స్పందించనప్పటికీ ఇది ఎంత దూరం వెళుతుందో అన్న అనుమానాలు తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాయి…చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus