Shiva Nirvana: విజయ్ దేవర కొండ ఖుషి కోసం దర్శకుడి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!

ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం సమంత, విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.

సమంత, విజయ్ దేవరకొండల ఇమేజ్ కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ 23 కోట్లు తీసుకున్నాడుట. సమంత మాత్రం నాలుగున్నర కోట్లు తీసుకుందని టాక్. ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడికి ఇంత పారితోషికం ఇస్తున్నారంటే సినిమాకు మంచి గట్స్ వస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ రెమ్యునరేషన్ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

రీసెంట్ గా ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంతలో విజయ్ చొక్కా విప్పి తన బనియన్ పై సందడి చేసాడు. వేదికపై సమంత-విజయ్ ల కెమిస్ట్రీ వేడెక్కింది. విజయ్ దేవరకొండ, సమంతల అభిమానులు ఖుషీ మ్యూజికల్ నైట్‌ను బాగా ఆస్వాదించారు. ఇద్దరూ వేదికపై తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

దీంతో వేదిక అభిమానుల ఈలలతో మారుమోగింది. శాకుంతలం తర్వాత సమంత విజయ్ దేవరకొండతో ఖుషీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలాగే ఉంది. లైగర్ సినిమాతో డిజాస్టర్ అయిన తర్వాత ఖుషీ సినిమాతో ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోవాలని చూస్తున్నాడు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus