సినీ సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడటం అనేది ఈ మధ్యన కామన్ అయిపోయింది.పట్టుపడితే పర్వాలేదు.. మద్యం మత్తులో అంతకు మించి ప్రవర్తిస్తేనే ప్రాబ్లెమ్..! సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కామిని అనే లేడీ డైరెక్టర్ పీకలదాకా తాగి పోలీసులను బూతులు తిట్టింది. దీంతో ఆమె పై కేసు నమోదవ్వడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..డిసెంబర్ 6వ తేదీ ఆదివారం రాత్రి తన స్నేహితుడు శేషు ప్రసాద్‌తో కలిసి కారులో డ్రైవ్ కు వెళ్ళింది అసిస్టెంట్ డైరెక్టర్ కామిని.
ఈ క్రమంలో పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో భాగంగా చెక్ చెయ్యడానికి కామిని కారుని ఆపారు. కారుని డ్రైవ్ చేస్తున్న శేషు లిమిట్ కు తాగడంతో కారును సీజ్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కామిని పోలీసుల పై రెచ్చిపోయింది. అసలే తాగి ఉంది.. కనీసం అలోచించి మాట్లాడే స్థితిలో కూడా ఆమె లేదు. ‘తాగితే తప్పేంటి..’ అన్నట్టు ప్రశ్నిస్తూ పోలీసులను ఎదిరించింది. ఆమె స్నేహితుడు శేషు ఆమెను కంట్రోల్ చేస్తున్నా..వినిపించుకోలేదు.
దాంతో సెక్షన్ 294(బి)(బూతులు తిట్టడం), సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా దాడి చెయ్యడం),సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించడం) వంటి వాటి కింద కామిని పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!