Vishwak Sen: ‘లైలా’ రిజల్ట్ తో అయినా విశ్వక్ మారతాడా..!

Ad not loaded.

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. గత ఏడాది నుండి గమనిస్తే అతను 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవే.. ‘గామి’ (Gaami) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) అలాగే లేటెస్ట్ గా వచ్చిన ‘లైలా’ (Laila) . వీటిలో ‘గామి’ బాగానే ఆడింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా దానిపై కూడా విమర్శల వర్షం కురిసింది. ఇక ‘మెకానిక్ రాకీ’ సినిమాకి గోల్డ్ కాయిన్లు వంటివి ఇచ్చి తెగ ప్రమోట్ చేసినా..

Vishwak Sen

అది కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ‘లైలా’ విషయానికి వస్తే.. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది అని చెప్పాలి. రిలీజ్ కి ముందు నటుడు 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) వల్ల ‘లైలా’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అది సినిమా పబ్లిసిటీకి కలిసి వస్తుంది అని అంతా అనుకున్నారు. వైసీపీ శ్రేణులు అయితే ఈ సినిమాని పెద్ద డిజాస్టర్ ని చేస్తాం అంటూ తొడలు గొట్టారు.

అయితే మొదటి నుండి ప్రేక్షకులకి ‘లైలా’ పై అంచనాలే లేవు. ఇక టాక్ కూడా నెగిటివ్ గా వచ్చింది. దీంతో ఆ క్రెడిట్ కూడా వాళ్ళ ఖాతాలో వేసేసుకుని హడావిడి చేసేస్తున్నారు. మరి బాక్సాఫీస్ నంబర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘లైలా’ అనేది విశ్వక్ సేన్ కి పెద్ద లెసన్ అని చెప్పాలి. ఎందుకంటే క్రేజ్ ఉంది కదా అని.. కథల్ని సరిగ్గా జడ్జి చేయకుండా కాంబినేషన్ ని నమ్ముకుని సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.

ప్రమోషన్ ఎంత చేసినా.. వాటిని జనాలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి తప్పులు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వంటి హీరోలు తెలుసుకుని సరి చేసుకుంటున్నారు. పూర్తిగా ఒక సినిమాపైనే శ్రద్ధ పెట్టి.. అతను కం బ్యాక్ ఇచ్చాడు. కానీ విశ్వక్ మాత్రం ఇంకా తన తప్పు తెలుసుకోవడం లేదు. మరి ‘లైలా’ రిజల్ట్ తో అయినా మారతాడేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus