It’s Complicated Review in Telugu: ఇట్స్ కంప్లికేటెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ad not loaded.

Cast & Crew

  • సిద్ధూ జొన్నలగడ్డ (Hero)
  • శ్రద్ధా శ్రీనాథ్, (Heroine)
  • సీరత్ కపూర్, షాలిని వాడికంటి (Cast)
  • రవికాంత్ పేరేపు (Director)
  • సురేశ్ ప్రొడక్షన్స్-వయాకామ్ 18 (Producer)
  • శ్రీచరణ్ పాకాల (Music)
  • షానిల్ డియో-సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 14, 2025

2020 లాక్ డౌన్ టైంలో విడుదలైన “కృష్ణ & హిజ్ లీల” సినిమాని తెగ ప్రేమించేశారు జనాలు. ఆ తర్వాత దానికి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది కాలంగా సినిమాలోని కొన్ని సీన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. “ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యుంటే బాగుండు” అని చాలా మంది పోస్టులు పెట్టారు. దాంతో మేకర్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని “ఇట్స్ కాంప్లికేటడ్” (It’s Complicated) అనే టైటిల్ తో థియేటర్లలో విడుదల చేసారు. మరి సినిమా థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం.!!

It’s Complicated Review

కథ: కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) (Siddu Jonnalagadda) ఓ నవతరం యువకుడు. చిన్నప్పుడే తండ్రి దూరమవ్వడంతో (ఇక్కడ దూరమవ్వడం అంటే చనిపోవడం కాదు.. అతని దగ్గర లేకపోవడం) తల్లి పెంపకంలో ఆధునిక భావాలతో పెరుగుతాడు. సగటు యువకుడిలాగే కాలేజ్ లో లవ్ స్టోరీ, వెంటనే బ్రేకప్.. ఆ తర్వాత మళ్ళీ లవ్.. అది బ్రేకప్ అయ్యేలోపు పాత లవ్ తో మళ్ళీ ప్యాచప్. అయితే.. ఈ బ్రేకప్ & ప్యాచప్ నడుమ చిన్న కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ లో కూడా చిన్న క్లారిటీ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఏ తీరానికి చేరింది అనేది నెట్ ఫ్లిక్స్ లో సినిమా (It’s Complicated) చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సిద్ధూ పోషించిన కృష్ణ అనే క్యారెక్టర్ కు మెజారిటీ యూత్ కనెక్ట్ అవ్వడం పక్కా.. అందుకు ముఖ్య కారణం సిద్ధూ నటన అయితే.. ఆ క్యారెక్టరైజేషన్ ను తీర్చిదిద్దిన విధానం మరో కారణం. చాలా ఈజ్ తో ఎక్కడా అతి లేకుండా.. చాలా రియలిస్టిక్ గా రోల్ ను క్యారీ చేశాడు. శ్రద్ధా శ్రీనాధ్ (Shraddha Rama Srinath) పోషించిన సత్య క్యారెక్టర్ భారతంలో కోపిష్టి సత్యను గుర్తు చేస్తుంది. బేసిగ్గా అబ్బాయిలకు గట్టిగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సత్యది. ఎందుకంటే.. 90% మంది అబ్బాయిలు ఇలాంటి సత్య అనే అమ్మాయిని తమ లైఫ్ లో ఒక్కసారినా చూసి ఉంటారు. ఈ అమ్మాయిలకు కోపం ఎందుకు వస్తుందో, ఎందుకు దూరంగా వెళ్లిపోతారో, మళ్ళీ ఎందుకు దగ్గరగా వస్తారో ఎవరికీ అర్ధం కాదన్నమాట. నాకు పర్సనల్ గా నచ్చిన క్యారెక్టర్ కూడా ఇదే.

షాలిని వాడికంటి పోషించిన రాధ పాత్ర కూడా మనకు తారపడుతూనే ఉంటుంది. అబ్బాయిలను ప్రేమతో కంటే ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్ట్ చేసి.. తమ వెంట తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎమోషనల్లీ వీక్ బట్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఎక్కడ ఏ విధంగా ఎమోషనల్ గా నొక్కితే అబ్బాయి మాట వింటాడో, చెప్పుచేతల్లో ఉంటాడో పర్ఫెక్ట్ గా తెలిసిన తెలివైన అమాయకురాలు రాధ. ఈ క్యారెక్టర్ కి షాలిని సరిగా యాప్ట్ అవ్వలేదు. పాత్రలో ఉన్న అమాయకత్వం, బేలతనం అమ్మాయి ముఖంగాలో కనిపించలేదు.

ఇక కృష్ణగాడి మూడో ఇంట్రెస్ట్ రుక్సార్ గా నటించిన సీరత్ కపూర్ (Seerat Kapoor). జీవితం మీద, ప్రేమ మీద మంచి క్లారిటీ ఉన్న ఆధునిక యువతి. ఎంత క్లారిటీ అంటే లవ్ కి లవ్ మేకింగ్ కి మధ్య ఉన్న తేడాను గమనించి.. ఆ తేడాను ఇతరులకు కూడా వివరించేంత. సీరత్ ఈ రోల్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యింది. ప్రెజంట్ జనరేషన్ అమ్మాయిల్లో లేని క్లారిటీని సీరత్ పాత్రలో చూపించి.. ఇలా ఉంటే ఏ గోల ఉండదు అనేది క్లారిటీ ఇచ్చారు దర్శక రచయితలు. తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో సంపత్, చెల్లెలి పాత్రలో సంయుక్త హెగ్డే, స్నేహితుడి పాత్రలో వైవా హర్ష అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సాంకేతికంగా సినిమా గురించి ముందుగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ డిజైన్ గురించి. కొన్ని ఏళ్ళు తరబడి చేసిన ప్రీప్రొడక్షన్ వల్ల కావచ్చు.. మేకర్స్ కి సీన్ డివిజన్ మీద ఉన్న క్లారిటీ వల్ల కావచ్చు తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. అందుకు ప్రొడక్షన్ డిజైన్ టీంను మెచ్చుకోవాలి. అలాగే.. షానిల్ డియో (Shaneil Deo) -సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు (Sai Prakash Ummadisingu) కలిసి చేసిన సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. కథ హైద్రాబాద్-బెంగుళూరు మధ్య నడుస్తుంది. అయితే.. లోకల్ లొకేషన్స్ తోనే ఆ డిఫరెన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అందుకు వారిద్దరినీ మెచ్చుకోవాలి. థ్రిల్లర్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) మెలోడీస్ తోనూ మాయ చేయగలను అని మరోసారి ప్రూవ్ చేసుకొన్నాడు.

ఇప్పుడు మన డైరెక్టర్ రవికాంత్ (Ravikanth Perepu) గురించి మాట్లాడుకోవాలి.. మనోడు క్షణం తర్వాత కాస్త గట్టి గ్యాప్ తీసుకొన్నాడు. రవికాంత్ రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు ఆలోచించి, ఒకానొక దశలో పట్టించుకోవడం మానేశారు కూడా. దాంతో “క్షణం” (Kshanam) క్రెడిట్ మొత్తం అడివి శేష్ ఎకౌంట్ లో పడిపోయింది. సొ, రవికాంత్ సెకండ్ సినిమా మీద ఆశలు లేవు, అంచనాలు లేవు. కానీ.. ఏమాత్రం తేడా కొట్టినా మనోడి టాలెంట్ మీద అనుమానాలు రేగుతాయి. ఈ ప్రేజర్ వల్లే ఎక్కువ గ్యాప్ తీసుకొన్నాడేమో అనిపించింది. అయితే.. క్షణంలో ఒక తల్లి తన కూతురు కోసం పడే తాపత్రయాన్ని ఎంత రియలిస్టిక్ గా తెరకెక్కించాడో..

ఈ సినిమాలో కృష్ణ ప్రేమ కథను, అతడి వ్యధను అంతే రియలిస్టిక్ గా చూపించాడు రవికాంత్. ముఖ్యంగా.. సిద్ధూ-సంపత్ నడుమ బార్ లో జరిగే డిస్కషన్ లో ఒక కొడుకు బాధను చాలా సింపుల్ & ఎఫెక్టివ్ గా చూపించాడు. అలాగే.. ప్రీక్లైమాక్స్ లో సిద్ధూ-షాలిని (Shalini Vadnikatti)-శ్రద్ధా శ్రీనాథ్ ల నడుమ సాగే గొడవలాంటి సంభాషణను కూడా అంతే మెచ్యూర్డ్ గా చూపించాడు. సో, సెకండ్ సినిమా సిండ్రోమ్ నుండి సక్సెస్ ఫుల్ గా బయటపడ్డాడు రవికాంత్.

విశ్లేషణ: ప్రెజంట్ జనరేషన్ యూత్ ప్రేమ అనే విషయంలో ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉంటున్నారు? వాళ్ళకి కావాల్సిన క్లారిటీ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం “ఇట్స్ కంప్లికేటెడ్” (It’s Complicated). సూటిగా సుత్తి లేకుండా 2.05 గంటల్లో కృష్ణగాడు చెప్పిన, చేసిన లీలను నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆనందించండి.

రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus