మహానటుడు నందమూరి తారక రామారావు రెండో భార్య లక్ష్మి పార్వతి జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె తారక్ గురించి ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని నందమూరి ఫ్యామిలీ వాళ్లు దూరం పెట్టారు. అప్పుడు అతన్ని, ఆమె తల్లి (షాలిని)ని నేను ఆదరించాను. డ్రస్సులు ఇప్పించాను. తొలి నృత్య ప్రదర్శనకు సాయం చేశాను. అమెరికా వెళ్లడానికి డబ్బులిచ్చాను.
అటువంటిది మా ప్రభుత్వం పడిపోగానే వాళ్ళు మా ఇంటికి రావడమే మానేశారు” అంటూ జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి సంగతులను వివరించారు. ఇక మహానటుడు నట వారసుడిగా తారక్ చెప్పుకుంటున్నారు, దానిపై మీ స్పందన ఏమిటని లక్ష్మి పార్వతిని అడగగా.. ఆమె సమాధానం ఇస్తూ “ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అంటే నేను ఒప్పుకోను. రాజకీయంగా కానీ, సినిమా పరంగా కానీ ఎన్టీఆర్ కి వారసులు ఎవరూ లేరు. ఆయనకు ఆయనే సాటి.” అంటూ వివరించారు. ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై మరిన్ని కామెంట్స్ చేశారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ ని చూడండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.