యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కళ్లు చెదిరే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. సైమా అవార్డ్స్ వేడుకలు దుబాయ్ లో జరగనుండగా ఈ వేడుకలలో పాల్గొనడానికి తారక్ దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీలలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు జరగనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిన విమానంలోనే హిమజ కూడా వెళ్లారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ అదుర్స్ అనేలా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
ఐఎండీబీలో దేవర మూవీ కథ గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతోంది. తారక్ ఈ సినిమాలో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారని జాన్వీ కపూర్ పాలు అమ్మే యువతి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న ఎన్టీఅర్ తమ కుటుంబాన్నే నమ్ముకున్న తీరప్రాంత ప్రజలను రక్షించడానికి అజ్ఞాతం వీడి వస్తాడని సమాచారం. కథ రొటీన్ గా ఉన్నా ఈ సినిమాలో కథనం కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భార్య లక్ష్మీ ప్రణతికి మొహమాటం ఎక్కువని తాను ఏదైనా చెబితే అవతలి వ్యక్తులు హర్ట్ అవుతారేమో అని ఆమె భయపడుతుందని తెలుస్తోంది. లక్ష్మీ ప్రణతిని ఈ విషయంలో మార్చాలని తారక్ చాలాసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదట. అయితే ఈ ఒక్క విషయాన్ని వదిలేస్తే మిగతా విషయాల్లో మాత్రం లక్ష్మీ ప్రణతి గ్రేట్ అని తారక్ ఫీలవుతారట. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి షార్ట్ బ్రేక్ ఇచ్చారని అనుకున్న విధంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది.
2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ సినిమాలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటుండగా దేవర రిలీజ్ డేట్ మాత్రం మారే ఛాన్స్ అయితే లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.