యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’. సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ చిత్రానికి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి.
‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని… సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మించారు.లవ్ స్టొరీ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాతలు కావడంతో ‘లక్ష్య’ చిత్రం పై మొదట కొంత అంచనాలు ఉన్నాయి. కానీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రాలేదు.
ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.68 cr |
సీడెడ్ | 0.26 cr |
ఉత్తరాంధ్ర | 0.29 cr |
ఈస్ట్ | 0.15 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.16 cr |
కృష్ణా | 0.21 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.94 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.06 cr |
‘లక్ష్య’ చిత్రానికి రూ.6.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.2.06 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
దాంతో బయ్యర్లకి రూ.4.42 కోట్ల నష్టాలు మిగిలినట్టు తెలుస్తుంది. ‘అఖండ’ ‘పుష్ప’ వంటి పెద్ద సినిమాల మధ్యలో రావడం వల్ల లక్ష్య చిత్రం నలిగిపోయినట్టు స్పష్టమవుతుంది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!