‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి రెండు క్లాసిక్స్ ను అందించిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు. సెకండ్ హాఫ్ బాగా రాకపోవడంతో తరుణ్ భాస్కర్ కి వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ రాలేదు. అయితే ‘కీడా కోలా’ తర్వాత వెంకీతో సినిమా ఉంటుంది అని చెప్పాడు. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు వల్ల తరుణ్ కెరీర్లో గ్యాప్ వచ్చేసింది.
నటుడిగా అతను సినిమాల్లో నటిస్తున్నా.. డైరెక్టర్ గా అయితే అతను రేసులో వెనుకబడ్డాడు. అయితే మొత్తానికి ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. కామెడీ ఉన్నప్పటికీ… ఆసక్తికరమైన కథ, కథనం లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ఓపెనింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి. కానీ ఈ చిత్రంతో తరుణ్ కి పెద్ద ఛాన్స్ లు వస్తాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మరీ ముఖ్యంగా వెంకటేష్ .. (Tarun Bhaskar) తరుణ్ భాస్కర్ కి ఛాన్స్ ఇస్తాడా? వెంకటేష్ ఇమేజ్ కి తగ్గ కథని తరుణ్ భాస్కర్ రెడీ చేయగలడా? చేసినా దానిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలడా? వంటి ఎన్నో ప్రశ్నలు అందరి మైండ్లో ఉన్నాయి. అయితే వెంకటేష్.. డైరెక్టర్ల ట్రాక్ రికార్డు చూసి ఛాన్స్ ఇచ్చే రకం కాదు.
ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. వెంకీ మాత్రమే కాదు దగ్గుబాటి రామానాయుడు గారు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు.. స్క్రిప్ట్ నచ్చితే కొత్త దర్శకులకైనా అవకాశాలు ఇవ్వడానికి ముందుంటారు. కాకపోతే స్క్రిప్ట్ స్టేజిలో ఎక్కువ టైం పడుతుంది అంతే..!
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!