Ravi Teja, Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో రవితేజ రోల్ ఇదే!

మాస్ మహారాజా రవితేజ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ‘క్రాక్’ తరువాత ఆయన నుంచి రెండు సినిమాలు వచ్చాయి. రెండూ వర్కవుట్ కాలేదు. త్వరలోనే ‘ధమాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా కాకుండా రవితేజ చేతుల్లో మరో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అందులో మెగా154 సినిమా ఒకటి. చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు బాబీ రూపొందిస్తోన్న ఈ సినిమాలో రవితేజను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ సవతి సోదరులుగా కనిపించనున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య నడిచే క్లాష్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. సినిమాలో చిరు క్యారెక్టర్ పేరు వాల్తేర్ వీరయ్య. ఇక రవితేజ క్యారెక్టర్ పేరు కూడా బయటకొచ్చింది. వైజాగ్ రంగరాజు అనే పాత్రలో కనిపిస్తారట రవితేజ.

ఈ రోల్ మాస్ ఆడియన్స్ కి మంచి ఐఫీస్ట్ అవుతుందని చెబుతున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు రవితేజ. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బాధేతి తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కథ ప్రకారం.. సినిమాలో చిరు గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతారట. రీసెంట్ గా రాజమండ్రిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది చిత్రబృందం. ఇప్పుడు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. జనవరి 2023లో సినిమా విడుదల కానుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus