మనసులోని మాటను బయటపెట్టిన లావణ్య త్రిపాఠి!

Advertisement

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాలతో లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం “ఉన్నది ఒక్కటే జిందగీ” ఈ వారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన మనసులోని మాటను బయటికి చెప్పారు. “ఉన్నది ఒక్కటే జిందగీ లో మ్యాగీ(మేఘన) రోల్ చేసాను. నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాంటి క్యారెక్టర్‌ ఇది. ఓ లక్ష్యంతో సాగుతుంది” అన్నారు. “నేను నటించిన సినిమా విజయం సాధిస్తుందా? లేదా? అన్న విషయాలు చాలా తక్కువగా ఆలోచిస్తాను. నాకంటూ మంచి సినిమాలు ఉన్నాయి.

స్క్రిప్ట్‌ని ఎంపికచేసుకోవడం వరకే నా నిర్ణయం. ఏదైనా ప్రేక్షకులే  నిర్ణయిస్తారు” అని వివరించారు. సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. నేను ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటాను. వాటని చెప్పుకోవడం ఇష్టముండదు. ఈ మధ్య నాకు  ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనిపిస్తోంది. అన్ని కుదిరితే త్వరలోనే బిడ్డను దత్తత తీసుకుంటాను” అని లావణ్య వివరించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus