Lavanya Tripathi, Varun Tej: వరుణ్ తేజ్ తో పెళ్లి.. లావణ్య ఏమందంటే?

అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాటి అతి తక్కువ కాలంలోనే యువ హీరోలతో మంచి అవకాశాలను అందుకుంది. ఇక ఈ బ్యూటీ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కొంతమంది హీరోలకు ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్ గా మారుతూ మంచి క్రేజ్ అయితే అందుకుంది. అయితే ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠి తన పెళ్లికి సంబంధించిన అనేక రకాల రూమర్స్ ఎదుర్కొంది.

ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వచ్చింది. అంతేకాకుండా వీరి ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ఎన్నో కథనాలు వెలువడ్డాయి మొదట్లో ఆ వార్తలపై పెద్దగా క్లారిటీ ఇవ్వకపోవడంతో అది నిజమేనేమో అని కూడా అనుకున్నారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి కూడా మెగా ఫ్యామిలీ తో చాలా క్లోజ్ గా వెళ్ళినట్లుగా అనిపించింది.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేసిన వరుణ్ తేజ్ తన సోదరి పెళ్లికి అలాగే ఫ్యామిలీ పార్టీ లో కూడా ఎక్కువగా లావణ్య త్రిపాటిని ప్రత్యేకంగా తీసుకువెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్లో నెటిజన్ల తో ముచ్చటించిన లావణ్య త్రిపాటి వరుణ్ తో పెళ్లి అంటగ అనే వార్తలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

నా పెళ్లి ఎవరితో అనేది ఇప్పటివరకు నాకే తెలియదు. ఇక వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో’ అని తెలిపింది. అంతే కాకుండా మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా? అని మరొక నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె ఆ విషయాన్ని పెద్దగా లెక్క చేయకుండా మాట మార్చేసింది. మొత్తానికి లావణ్య అయితే పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus