ఒకేసారి చేయదగ్గర రెండు సినిమాలు కావవి.. కానీ ఆ పని చేసి చూపించి తానెంత వైవిధ్యమైన నటుడో చెప్పకనే చెప్పాడు యశ్. యస్.. మేం చెప్పేది యశ్ నుండి ఇప్పుడు రానున్న ‘టాక్సిక్’, ‘రామాయణ’ సినిమాల గురించే. ఈ రెండు సినిమాలు దాదాపు పారలల్‌గా తెరకెక్కాయి. రెండూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే. కానీ రెండూ చాలా డిఫరెంట్. గత కొద్ది రోజులగా అందరూ యశ్ ‘టాక్సిక్’ గురించి మాట్లాడుతున్నారు. అందులో రాయ, టికెట్ అంటూ రెండు పాత్రల్లో కనిపించాడు.
అయితే, అంతకుమించిన పాత్ర ‘రామాయణ’ సినిమాలో అతను పోషిస్తున్న రావణుడిది. ఈ పాత్ర ఎంతగా నచ్చింది అంటే.. ఆ క్యారెక్టర్‌తో పాటు సినిమాలో నిర్మాణ భాగస్వామిగా కూడా చేరాడు. రాముడి మంచితనాన్ని, సుగుణాలను చూపించాలంటే రావణుడి పాత్రలో బాగా నటించాలి అన్నాడు యశ్. తాను విలన్ పాత్రలకు న్యాయం చేయగలనని చెప్పిన ఆయన.. మంచి పాత్రలు చేసినా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
‘రామాయణ’ సినిమా కోసం తామంతా ఇగోలను పక్కన పెట్టామని, బెస్ట్ టీమ్‌తో కలసి పనిచేస్తున్నామని చెప్పాడు. రామాయణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పుడు మా తాత చెబితే రామాయణం అంటే ఇది అని ఒక విధంగా అనుకునేవాడిని. ఆ తర్వాత కొన్ని రోజులకు టీవీలో, సినిమాల్లో చూసిన తర్వాత నా ఊహ మారిందని చెప్పాడు యశ్. అందరికీ తెలిసిన కథైనప్పటికీ దాన్ని కొత్తగా చూపించాలి. అలా అని మతపరమైన భావాలను దెబ్బతీయకూడదు అని భావించానని చెప్పాడు.
నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ పార్ట్ 1’ సినిమా మన దేశంలో నవంబర్ 8న రిలీజ్ అవుతుంది. విదేశాల్లో నవంబరు 6నే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించింది. ఇక శూర్పణకగా రకుల్‌ప్రీత్ సింగ్ కనిపించనుంది. ఆంజయనేయుడిగా సన్నీ డియోల్ నటించాడు. అయితే ప్రచార చిత్రాల్లో ఆయనింకా కనిపించలేదు.