కావాలయ్యా సాంగ్ పై విమర్శలు చేసిన ప్రముఖ నటుడు.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరోయిన్ తమన్నా సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో జైలర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలోని కావాలయ్యా సాంగ్ ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

అయితే లియో (LEO) సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మన్సూర్ అలీ ఖాన్ నటించారు. తాజాగా ఈ నటుడు మీడియాతో మాట్లాడుతూ కావాలయ్యా సాంగ్ మ్యూజిక్, డ్యాన్స్ స్టెప్పులు ఏమీ బాగాలేవని అన్నారు. తను నటించిన సరకు అనే మూవీలో చాలా సీన్స్ ను సెన్సార్ సభ్యులు కత్తిరించారని ఆయన చెప్పుకొచ్చారు. కావాలయ్యా సాంగ్ లో తమన్నా వేసిన స్టెప్ చాలా దరిద్రంగా ఉందని మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

తమన్నా చేతిని ఓ రకంగా ఆడించడం అస్సలు బాలేదని ఆయన అన్నారు. ఆ సాంగ్ చూడటానికి అసహ్యంగా ఉందని అలాంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. సెన్సార్ సభ్యుల తీరు తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

తన సినిమాకు అన్యాయం జరిగిందని మన్సూర్ అలీ ఖాన్ చెప్పుకోవడంలో న్యాయం ఉందని ఇతర సినిమాలను తప్పుబట్టడం కరెక్ట్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్ కామెంట్ల గురించి తమన్నా లేదా ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. ఇలాంటి కామెంట్ల వల్ల మన్సూర్ అలీ ఖాన్ కెరీర్ ప్రమాదంలో పడనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus