విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు అదిరిపోయే స్థాయిలో ఉన్నా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గుతున్నాయి. తెలుగులో భగవంత్ కేసరి సినిమాకు బుకింగ్స్ అదిరిపోయే లెవెల్ లో జరుగుతున్నాయి. లియో సినిమా డామినేషన్ నెమ్మదిగా తగ్గుతోంది. సితార నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కులను 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ నిర్మాతలకు మాత్రం ఒకింత భారీ స్థాయిలోనే లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లియో నిర్మాతలు తాజాగా మాట్లాడుతూ లియో రూ.1000 కోట్లు సాధిస్తుందని మేము ఆశించడం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. లియో నిర్మాత లలిత్ కుమార్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. తమిళనాడులో నాలుగు గంటలకు షో వేయకపోవడంతో 2 లక్షల మంది లియో సినిమాను ఇతర రాష్ట్రాల్లో చూశారని లలిత్ కుమార్ తెలిపారు. లియో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ విషయంలో సంతోషంగా ఉన్నామని లియో సినిమా హిందీ మార్కెట్ నుంచి భారీ కలెక్షన్లను ఆశించడం లేదని లలిత్ కుమార్ తెలిపారు.
ఫ్యాన్స్ కొరకు బెనిఫిట్ షోస్ కోసం ప్రయత్నించామని లియో సినిమా చూసి రజనీకాంత్ మెచ్చుకున్నారని నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారని లలిత్ కుమార్ కామెంట్లు చేశారు. మాస్టర్ సినిమా సమయంలోనే విజయ్ కు ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకున్నామని ఆయన అంగీకరించలేదని లలిత్ కుమార్ అన్నారు.
నాకు జీతం ఇస్తున్నారు కదా స్పెషల్ గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదని విజయ్ చెప్పారని లలిత్ కుమార్ చెప్పుకొచ్చారు. లలిత్ కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. లియో మూవీ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. లియో సినిమా (Leo Movie) విజయ్ అభిమానులకు ఎంతగానో నచ్చింది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!