Liger Trailer: యాక్షన్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ‘లైగర్’ ట్రైలర్!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్).టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్,అక్డీ పక్డీ సాంగ్, గ్లింప్స్ తో ఈ చిత్రం పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్‌ కూడా రిలీజ్ అయ్యింది.తెలుగులో ప్రభాస్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, మలయాళం ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్ ఆవిష్కరించగా, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్.. లాంచ్ చేయడం జరిగింది.

విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో రా అండ్ రస్టిక్ గా కనిపిస్తున్నాడు. హీరోకి ఏమాత్రం తీసిపోని తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుంది. ట్రైలర్లో ఈ రెండు పాత్రల బాండింగ్ మనకు ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ రోజుల్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి. ఇందులో కూడా హీరో కిక్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు.కానీ అతను చాయ్‌వాలా అని చిత్ర బృందం చెప్పుకొచ్చింది. ఓ చాయ్‌వాలా అయిన విజయ్ దేవరకొండ MMA టైటిల్‌ను ఎలా గెలుస్తాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ ట్రైలర్ లో చూపించారు.

హీరోకి నత్తి ఉన్నట్టు కూడా చూపించారు. హీరోయిన్ అనన్య పాండే గ్లామర్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కిక్ బాక్సింగ్ చేస్తూ విజయ్ దేవరకొండ అండర్ వేర్ తో చేసే డాన్స్ మీమ్స్ చేసే బ్యాచ్ కి మంచి స్టఫ్ గా మారే అవకాశం ఉంది.ఇక ట్రైలర్ చివర్లో విజయ్ దేవరకొండ “నేను ఫైటర్‌ని” అని చెప్పినప్పుడు,మైక్ టైసన్ ఎంట్రీ ఇచ్చి “నువ్వు ఫైటర్ అయితే, నేను ఏంటి మరి?” అంటూ పలికిన డైలాగ్ హైలెట్ అని చెప్పాలి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ట్రైలర్ బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus