‘వెంకీమామ’ ను ‘సోగ్గాడే చిన్ని నాయన’ డైరెక్టర్ రిజెక్ట్ చేశాడా..!

మరో 4 రోజుల్లో మామా అల్లుళ్ళ సందడి థియేటర్లలో మొదలు కాబోతుంది. అవును ‘వెంకీమామ’ చిత్రం డిసెంబర్ 13న విడుదల కాబోతుంది. కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు.. హీరోయిన్లు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్లు, ప్రోమోలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రం కథ ఎలా పుట్టింది.. అనేదాని పై నిర్మాత సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపారు. ‘ మొదట జనార్దన్ మహర్షి అనే వైటర్ ‘వెంకీమామ’ కు సంబందించిన ఐడియా చెప్పాడు. ఈ ఐడియా ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం. ఈ క్రమంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల ముందుకు వచ్చాడు. అయితే మరోపక్క నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రం కూడా చేయాల్సి ఉండడంతో అతను తప్పుకున్నాడు. ఈ క్రమంలో కోన వెంకట్ ను సంప్రదించగా.. బాబీ ని రెఫర్ చేసాడు. అలా ఈ కథని డెవలప్ చేసి వినిపించాడు. ఆయన వినిపించిన కథ వినగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఎస్… ఇతనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి.. బాబీని ఫైనల్ చేసాం. ఇక ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు.” అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus