టాలీవుడ్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన 15 లిరికల్ సాంగ్స్ లిస్ట్!

  • January 4, 2024 / 12:23 PM IST

ఒక సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసే లిరికల్ సాంగ్స్ అనేవి చాలా కీలకమైనవి. పాటలు బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే.. అని అంతా అంటూ ఉంటారు. ఈ ఆధునిక యుగంలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేది లిరికల్ సాంగ్స్ యొక్క లైక్స్ ని, వ్యూస్ ని బట్టి చెబుతుంటారు. ఇప్పుడు మనం 24 గంటల్లో అత్యధిక లైక్స్, వ్యూస్ నమోదు చేసిన పాటలు ఏంటో, టాప్ -10 లో ఏవేవి ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) ధం మసాలా :

మహేష్త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ‘గుంటూరు కారం‘ నుండి రిలీజ్ అయిన మొదటి లిరికల్ సాంగ్ ఇది. 24 గంటల్లో ఈ పాట 17.42 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది.

2) పెన్నీ :

మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట‘ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ గా ఈ ‘పెన్నీ’ పాట రిలీజ్ అయ్యింది. ఇది 24 గంటల్లో 16.38 వ్యూస్ ని నమోదు చేసి నెంబర్ 2 ప్లేస్ ను దక్కించుకుంది.

3) కళావతి :

మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా ఈ ‘కళావతి’ పాట రిలీజ్ అయ్యింది. ఇది 24 గంటల్లో 14.78 వ్యూస్ ని నమోదు చేసి నెంబర్ 3 ప్లేస్ ను దక్కించుకుంది.

4) మ మ మహేష :

మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి 4వ లిరికల్ సాంగ్ గా ఈ ‘మ మ మహేష’ పాట రిలీజ్ అయ్యింది. ఇది 24 గంటల్లో 13.56 వ్యూస్ ని నమోదు చేసి నెంబర్ 4వ ప్లేస్ ను దక్కించుకుంది.

5) ఉ అంటావా ఉఊ అంటావా :

అల్లు అర్జున్సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప‘ సినిమా నుండి 5వ లిరికల్ సాంగ్ గా ఈ ‘ఉ అంటావా ఉఊ అంటావా’ పాట రిలీజ్ అయ్యింది. దీనికి 24 గంటల్లో 12.39 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

6) లాల భీమ్లా :

పవన్ కళ్యాణ్రానా కాంబినేషన్లో రూపొందిన ‘భీమ్లా నాయక్‘ సినిమాకు సంబంధించిన ఈ లిరికల్ సాంగ్ 24 గంటల్లో 10.20 మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసింది.

7) సాన కష్టం :

చిరంజీవి – రాంచరణ్కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘ఆచార్య‘ సినిమా నుండి రిలీజ్ అయిన ఈ లిరికల్ సాంగ్ 24 గంటల్లో 10.16 మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసింది.

8) కుర్చీ మడతపెట్టి :

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ‘గుంటూరు కారం’ నుండి రిలీజ్ అయిన మూడో లిరికల్ సాంగ్ ఇది. 24 గంటల్లో ఈ పాట 9.52 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి టాప్ 10లో స్థానం దక్కించుకుంది.

9) బాస్ పార్టీ :

చిరంజీవిరవితేజబాబీ కాంబినేషన్లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య‘ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ‘బాస్ పార్టీ’ పాట 24 గంటల్లో 9.51 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి రికార్డు సృష్టించింది.

10) సామి సామి :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ సినిమా నుండి 3వ లిరికల్ సాంగ్ గా ఈ ‘ఉ అంటావా ఉఊ అంటావా’ పాట రిలీజ్ అయ్యింది. దీనికి 24 గంటల్లో 9.06 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

11) సమయమా :

నాని హీరోగా తెరకెక్కిన ‘హాయ్ నాన్న‘ సినిమా నుండి రిలీజ్ అయిన మొదటి లిరికల్ సాంగ్ ఇది. 24 గంటల్లో ఈ పాట 8.35 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

12) దాకో దాకో మేక :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ గా ఈ ‘దాకో దాకో మేక’ పాట రిలీజ్ అయ్యింది. దీనికి 24 గంటల్లో 8.32 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

13) భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ :

‘భీమ్లా నాయక్’ నుండి మొదటి లిరికల్ సాంగ్ గా ఈ ‘భీమ్ భీమ్ భీమ్లా నాయక్’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇది 24 గంటల్లో 8.28 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

14) మైండ్ బ్లాక్ :

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ గా ఈ పాట రిలీజ్ అయ్యింది. ఇది 24 గంటల్లో 7.87 మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసింది.

15) పూనకాలు లోడింగ్ :

చిరంజీవి (Chiranjeevi) – రవితేజ – బాబీ కాంబినేషన్లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ నుండి రిలీజ్ అయిన ఈ పాట 24 గంటల్లో 7.64 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి రికార్డు సృష్టించింది

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus