Balakrishna, Mani Sharma: బాలయ్య – మణిశర్మల కలయికలో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా..

  • December 1, 2022 / 06:51 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషన్లకు సంబంధించి కొన్ని సెంటిమెంట్స్, కాంబినేషన్స్ భలే సెట్ అవుతుంటాయి.. నటసింహ నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. అప్పట్లో భార్గవ్ ఆర్ట్స్, నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి, డైరెక్టర్ కోడి రామకృష్ణలది ఓ క్రేజీ కాంబినేషన్.. అలాగే కెమెరామెన్ వి.ఎస్.ఆర్. స్వామి, రైటర్స్ పరుచూరి బ్రదర్స్.. సంక్రాంతి సీజన్.. టైటిల్లో ‘సింహా’ పదం.. సిమ్రాన్.. ఇలాంటి సెంటిమెంట్స్ బాలయ్యకి బాగా వర్కౌట్ అయ్యాయి.. ఇక ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మతో బాలయ్యది బీభత్సమైన, బాక్సాఫీస్ బద్దలు కొట్టిన కాంబినేషన్.. వీరి కలయికలో ట్రెండ్ సెట్టర్ మూవీస్..

ఎవర్ గ్రీన్ సాంగ్స్.. గూస్ బంప్స్ తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్ కలిగిన సినిమాలున్నాయి.. ఇప్పటి వరకు బాలకృష్ణ – మణిశర్మల కలయికలో వచ్చిన సినిమాలేంటో.. వాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. సమరసింహా రెడ్డి..

బాలయ్య, మణిశర్మల కలయికలో వచ్చిన మొదటి చిత్రమిది.. పాటలు అయితే ఓ ఊపు ఊపాయి.. నేపథ్య సంగీతానికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య – బి.గోపాల్ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ ఫిలిం ఇండస్ట్రీ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది..

2. నరసింహ నాయుడు..

బాలయ్య, బి.గోపాల్, మణిశర్మల త్రయం కలిసి చేసిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్.. ఇక సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు..

3. భలేవాడివి బాసూ!..

‘తమ్ముడు’ డైరెక్టర్ పి.ఎ. అరుణ్ ప్రసాద్ డైరెక్టర్ (అనిల్ రావిపూడి బాబాయ్).. సినిమా ఫ్లాప్ కానీ పాటలు బాగుంటాయి.. సమంత ‘యశోద’ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత..

4. సీమసింహం..

బాలయ్య, మణిశర్మ కాంబోలో సంక్రాంతికి వచ్చిన మూడో సినిమా.. సీజన్ లెక్క ప్రకారం నాలుగో సినిమా.. యావరేజ్ అయినా కానీ ‘చందమామ..చందమామ’ మెలోడీ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్.. జి. రామ్ ప్రసాద్ దర్శకుడు..

5. చెన్నకేశవ రెడ్డి..

సాంగ్స్, రీ రికార్డింగ్‌తో ప్రాణం పోశారు మణిశర్మ.. హిట్ టాక్‌కి కాస్త దూరంలో ఆగిపోయిన ‘చెన్నకేశవ రెడ్డి’ సంగీతం ఎప్పటికీ సెన్సేషనే..

6. పలనాటి బ్రహ్మనాయుడు..

బాలయ్యకిది బి.గోపాల్‌తో 5, మణిశర్మతో 6వ సినిమా.. అంచనాలు తలకిందులయ్యాయి కానీ సాంగ్స్ వినడానికి బాగుంటాయి..

7. లక్షీ నరసింహా..

మరోసారి సంక్రాంతి బరిలో నటసింహ, మెలోడీ బ్రహ్మల కాంబో పవర్ చూపించిందీ చిత్రం.. పాటలతో పాటు ఆర్ఆర్ కూడా ఆకట్టుకుంటుంది.. జయంత్ సి.పరాన్జీ డైరెక్ట్ చేశారు.

8. అల్లరి పిడుగు..

హీరో, రైటర్స్ (పరుచూరి బ్రదర్స్), డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వెంటనే వర్కౌట్ చేసిన ప్రాజెక్ట్ ఇది.. ఫలితం తేడా కొట్టింది కానీ పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి..

9. వీరభద్ర..

ఏ.ఎస్. రవి కుమార్ చౌదరి (యజ్ఞం ఫేమ్) డైరెక్టర్.. అంబికా కృష్ణ నిర్మాత.. ఓ రెండు పాటలు తప్ప సినిమా ఏమంత అనిపించదు..

10. ఒక్కమగాడు..

ఈ సినిమా ఎందుకు చేశానా? అని బాలయ్య ఓపెన్‌గానే ఫీలయ్యాడు.. ఫలితం పక్కన పెడితే మణిశర్మ మాత్రం న్యాయం చేశాడు..

11. మిత్రుడు..

రాజమౌళి శిష్యుడు దర్శకుడు.. జక్కన్న ఫాదర్ కథ.. ‘లెజెండ్’, ‘అఖండ’ ల మాటల రచయిత పనిచేసిన ఈ చిత్రం పరాజయం పాలైంది.. పాటలూ సో సో గానే ఉంటాయి..

12. పరమవీర చక్ర..

దర్శకరత్న దాసరి, బాలయ్య కలయికలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్.. సినిమానే పోయినప్పుడు పాటలు మాత్రం ఏం కాపాడతాయి చెప్పండి..

13. లయన్..

కొత్త దర్శకుడితో బాలయ్య చేసిన ప్రయోగం ఇది.. రెండు పాటలు బాగుంటాయి.. ఇదే బాలయ్య – మణిశర్మ కాంబోలో వచ్చిన చివరి చిత్రం..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus