Tollywood Item Songs: 2021 లో అదరగొట్టిన ఐటెం సాంగ్స్ లిస్ట్..!

కమర్షియల్ సినిమా అంటే యాక్షన్ డోస్, గ్లామర్ డోస్, కామెడీ డోస్ మాత్రమే ఉంటేనే సరిపోదు…అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉండాలి. లేదు అంటే మాస్ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయం. ఈ విషయం స్టార్ డైరెక్టర్లకి బాగా తెలుసు. ఇది తరతరాల నుండీ వస్తున్న ఆనవాయితీ కూడా.! అప్పుడే మాస్ ప్రేక్షకులు సీటీ కొట్టి మరీ రచ్చ చేస్తుంటారు.అవే థియేటర్లకు కళ తెప్పిస్తాయి. అయితే ఈ ఏడాది వచ్చిన ‘వకీల్ సాబ్’ ‘అఖండ’ వంటి పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ లేవు. కథ ప్రకారం వాటిలో ఇరికించే అవకాశం దక్కలేదు. అయితే ‘పుష్ప’ వంటి మరో పెద్ద సినిమాలో ‘ఉ అంటావా ఉఊ అంటావా’ అనే పాట మాత్రం దుమ్ము దులిపేసింది. ఇలాగే 2021 లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)భూమ్ బద్దల్ :

రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’ లో ఈ పాట మాస్ ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది.అప్సరా రాణి వేసిన చిందులు.. తమన్ అందించిన ట్యూన్ అందరిలోనూ ఎనర్జీని నింపిందనే చెప్పాలి.

2)డించక్ డించక్ డింక :

రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన ‘రెడ్’ మూవీలోని ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. హెబ్బా పటేల్ ఈ పాటకి అందాలు ఆరబోసిన తీరు, రామ్ ఎనర్జిటిక్ స్టెప్పులు.. మాస్ పల్స్ తెలిసిన సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన బీట్ కలగలిపి ఈ పాటని మాస్ ప్రేక్షకులకి చేరువయ్యేలా చేసాయి.

3)రంభ ఊర్వశి మేనక :

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలోని ఈ పాటకి ‘బిగ్ బాస్’ ఫేమ్ మోనాల్ వేసిన చిందులు.. సూపర్ అనే చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

4)పైన పటారం :

‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయ నర్తించిన ఈ పాట కూడా మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

5)మందులోడా :

‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంలోని ఈ పాట కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.

6)పెప్సీ ఆంటీ :

‘సీటీమార్’ చిత్రంలోని ఈ పాటలో కూడా అప్సరా రాణి వేసిన మాస్ స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి.

7)చాంగురే :

‘గల్లీ రౌడీ’ చిత్రంలోని ఈ పాట కూడా మాస్ ప్రేక్షకుల్ని అలరించింది.

8)ఉ అంటావా ఉఊ అంటావా :

‘పుష్ప’ చిత్రంలోని ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులతో కూడా చిందులు వేయించాయి.

9) నా తప్పు ఏమున్నదబ్బా :

‘బ్లాక్ రోజ్’ చిత్రంలోనిది ఈ పాట. ఊర్వశి రౌటెలా ఈ పాటకి వేసిన చిందులు మణిశర్మ అందించిన ట్యూన్.. మాస్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో అలరించాయి.

10)హే రంభ :

‘మహాసముద్రం’ చిత్రంలోనిది ఈ పాట. ఇందులో ఐటెం గర్ల్ ఉండదు కానీ హీరోయిన్ రంభ ఫ్యాన్స్ కోసం చేసిన ఈ మాస్ పాట అందరినీ అలరించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus