2022 లో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!

2022..యావత్ సినీ పరిశ్రమకి చాలా స్పెషల్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతీ ఏడాదిలా ఈ ఏడాది విడుదలైన ప్రతి పెద్ద సినిమాకి జనాలు వెళ్లి క్యూలు కట్టలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ వంటి సినిమాలు కూడా బెనిఫిట్ షోలకు క్రౌడ్ పుల్లింగ్ లేక ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. హైప్ క్రియేట్ అయిన సినిమాలకే జనాలు వెళ్లారు. ఒకవేళ ఆ సినిమా బాగోకపోతే వీకెండ్ తర్వాత ఆ సినిమాల కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి.

పెరిగిన టికెట్ రేట్లు ఒకవైపు, ఓటీటీలు మరోవైపు జనాలను థియేటర్లకు వెళ్లకుండా చేసేశాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుండి రికార్డులు కొట్టిన సినిమాలు చాలా తక్కువ అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్(గ్రాస్) రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి – ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మొదటి రోజు రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

2) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు రూ.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.

3) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.41 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.31 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) గాడ్ ఫాదర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.21 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) ఎఫ్ 3 :

వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.17 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9) లైగర్ :

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.15.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) బంగార్రాజు :

నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

11) అవతార్ 2 :

జేమ్స్ కేమరూన్ సృష్టించిన మరో అద్భుతం ‘అవతార్ 2’ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.13.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus