ఈ ఏడాది రీ ఎంట్రీ ఇచ్చిన 10 మంది స్టార్స్ లిస్ట్!

ప్రతి ఏడాది కొత్త హీరోలు, హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ ఈ 2022 లో కొంతమంది నటీనటులు, దర్శకులు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు సినిమాల్లో బాగా రాణించిన వాళ్ళు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు అంటే సహజంగానే అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. దీంతో ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ చేకూరుతుంది అని చెప్పొచ్చు. సరిగ్గా ఇలాగే ఈ 2022 లో కూడా జరిగింది. మరి ఈ ఏడాది రీ ఎంట్రీ ఇచ్చిన ఆ నటీనటులు ఎవరో, దర్శకులు ఎవరో.. ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారో ఓ లుక్కేద్దాం రండి :

1) భాగ్యశ్రీ :

1998 లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘యువరత్న రాణా’ మూవీలో చెల్లెలు పాత్ర పోషించిన భాగ్యశ్రీ.. ఈ ఏడాది వచ్చిన ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈమె రీ ఎంట్రీ వృధా అయిపోయింది.

2) తొట్టెంపూడి వేణు :

రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు వేణు. కానీ ఈ మూవీ హిట్ అవ్వలేదు.

3) సీనియర్ నటి అర్చన :

ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు.




4) సియా గౌతమ్/అదితి గౌతమ్ :

‘నేనింతే’ హీరోయిన్ ఈ ఏడాది గోపీచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు.




5) మోహన్ రాజా :

ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి, హనుమాన్ జంక్షన్ దర్శకుడు అయిన మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.




6) సర్వధమన్ డి బెనర్జీ :

‘సిరివెన్నెల’ ‘స్వయంకృషి’ చిత్రాల నటుడు ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు.




7) లైలా :

ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ లైలా.. కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయ్యింది.




8) ఎస్వీ కృష్ణారెడ్డి :

‘సంబరం’ మూవీ తర్వాత… దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి .. ‘నేను మీకు బాగా కావలసిన వాడిని’ చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు.




9) అమ్మ రాజశేఖర్ :

‘హై 5’ అనే చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు అమ్మ రాజశేఖర్.




10) సుమ :

చాలా కాలం తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సుమ




11) వెంకట్ :

ఒకప్పటి హీరో వెంకట్ ఈ ఏడాది సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

అదండీ ఈ ఏడాది రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ లిస్ట్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus