తారక్ ఫిట్ నెస్ కోచ్ గా లాయిడ్ స్టివెన్స్

  • January 3, 2018 / 06:49 AM IST

టాలీవుడ్ భారతదేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమగా మారుతోంది. ఇదివరకు అత్యధిక సినిమాలను నిర్మించే పరిశ్రమగా పేరున్న తెలుగు ఇండస్ట్రీ బాహుబలి తో భారీ కలక్షన్స్ సాధించే పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ టెక్నీషియన్లు మనతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం సినిమా కోసమే కాదు మన స్టార్స్ ని హాలీవుడ్ స్టార్స్ గా మార్చడానికి ఫిట్ నెస్ నిపుణులు సైతం నగరానికి వస్తున్నారు. జై లవకుశ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్ చిత్రం కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఇందులో ఎన్టీఆర్ చాలా గ్లామర్ గా కనిపించనున్నారు. ఇందుకోసం హాలీవుడ్ ఫిట్ నెస్ కోచ్ లాయిడ్ స్టివెన్స్ నియమించారు. అతని సలహాతో బరువు తగ్గి తారక్ కుర్రోడిలా మారిపోనున్నారు. అతనితో కలిసి తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందంగా కనిపించడానికి ఇంత కేర్ తీసుకుంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ 28 వ సినిమా షూటింగ్ కి వెళ్లకముందే క్రేజీగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus