Lobo: సిల్లీగా దొరికిపోయిన లోబో.. ఇజ్జత్ పోయేలా..!

బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఈసారి సరికొత్త వండర్స్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది కంటే ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు సెలబ్రిటీల విషయంలో చాలా విబిన్నంగా ఆలోచించినట్లు అర్ధమయ్యింది. భిన్న స్వభావాలు కలిగిన వారిని హౌజ్ లోకి రప్పించి చాలా మంచి పని చేశారు అని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా లోబో వంటి వారు రావడం హైలెట్ అవుతుంది.

అయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఈ విషయంలో లోబోని ఓ వర్గం నెటిజన్లు ట్రోల్స్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ అంటే తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని, అసలు తనకు అస్సలు సెట్ అవ్వదని అన్నాడు. ఒక విధంగా అవకాశం రాకపోవడమే మంచిదయ్యిందని కూడా కామెంట్ చేశాడు. బిగ్ బాస్ కు ఒక దండంరా అయ్యా అని చెప్పడంతో సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

బిగ్ బాస్ షో లోకి అడుగు పెట్టిన మొదట్లోనే డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటూ వస్తున్న లోబో కొన్ని వారాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగేలా ఉంటాడని అనిపిస్తోంది. కానీ ఒకప్పుడు బిగ్ బాస్ అంటేనే ఇష్టం ఉండదని చెప్పి ఇప్పుడు మాత్రం అదే తనకు మరొక లైఫ్ అని, ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అని పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఇక ఛాన్స్ దొరకడంతో ఓ వర్గం వారు అతన్ని ఆడుకుంటున్నారు.


బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus