Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

సినిమా పరిశ్రమలో ఎవరైనా బిజీ అవ్వాలన్నా, బిజీగా ఉన్నోడు ఖాళీగా మారిపోవాలన్నా శుక్రవారానికి మాత్రమే సాధ్యం. ఒక్కోసారి ఒక రోజు ముందుకు కూడా వెళ్తుంది అనుకోండి. అంటే సినిమా ఫలితం పరిస్థితి మార్చేస్తుంది. ఆ పరిస్థితిని నేర్పుగా దాటొస్తే తర్వాత సినిమా చేతికొస్తుంది. ఇప్పుడు ఇలా నేర్పుగా పక్కకు తప్పుకొని కొత్త సినిమాను ప్రారంభించారు ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. అల్లు అర్జున్‌తో ఓ సినిమాను ఓకే చేసుకొని ఇటీవల స్పెషల్‌ సాంగ్‌ వీడియోతో అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.

Lokesh Kanagaraj

గతేడాది ‘కూలీ’ సినిమా రూపంలో ఎవరూ ఊహించని, వద్దనుకోని హైప్‌తో బాక్సాఫీసు దగ్గరకు వచ్చారు లోకేశ్‌ కనగరాజ్‌. రజనీకాంత్‌, నాగార్జున లాంటి స్టార్లతో అందులోనూ చాలా కేమియోలతో చేసిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్లు సాధించినా విమర్శలు, అభిమానుల ప్రశంసలు పొందలేకపోయింది. దీంతో లోకేశ్‌ మ్యాజిక్‌ అయిపోయిందా అనుకున్నారంతా. ఈ క్రమంలో ఆయన గురించి వచ్చిన కొత్త సినిమాల పుకార్లు అన్నీ ఆగిపోయాయి. ఎవరూ ఊహించనట్లుగా బన్నీ సినిమా అనౌన్స్‌ చేశారు.

అయితే, ఇప్పుడు తన లైనప్‌ గురించి.. గతంలో వచ్చిన సినిమాల పుకార్ల గురించి క్లారిటీ ఇచ్చారు. ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’ సినిమాలు అలానే ఉన్నాయని చెప్పారు లోకేశ్‌. ‘ఖైదీ 2’ కోసం అనుకున్న డేట్లను కార్తి వేరొకరికి ఇవ్వాల్సి రావడంతో ఆ సినిమా ఆగింది అని చెప్పారు. మిగిలిన రెండు సినిమాలు కూడా అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతాయి అని చెబుతున్నారు. లారెన్స్ హీరోగా లోకేశ్‌ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘బెంజ్’ లోకేశ్‌ సినిమాటిక్ యునివర్స్‌లో భాగమే.

అంటే ప్రస్తుతం లోకేశ్‌ పోయిన తన పూర్వపు ఫామ్‌ను తిరిగి వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మామూలుగా అయితే ఇలా డౌన్‌ అయినప్పుడు విజయ్‌తో సినిమా చేసేవారు లోకేశ్‌. కానీ ఆయన ఇప్పుడు సినిమాలకు విరామం ప్రకటించేశారు. అయితే ఇప్పుడు లోకేశ్‌ ముందుకొచ్చి తన ఎల్‌సీయూలో సినిమా చేస్తున్నా అని అనౌన్స్‌ చేస్తే ఆటోమేటిగ్గా హైప్‌ పెరుగుతుంది.

రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus