పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసి క్రిష్ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గురువారంతో ఈ సినిమా షెడ్యూల్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్ లో రెండు పాటలను పూర్తి చేశాడట క్రిష్. గురువారం నుండి ఇరవై రోజుల పాటు బ్రేక్ తీసుకోబోతుంది చిత్రబృందం. ఈలోగా పవన్ మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటాడా లేదా అనేది తెలియాల్సివుంది.
ఇదిలా ఉండగా.. సినిమా సెట్లో ఇతర దర్శకనిర్మాతల తాకిడి ఎక్కువగా ఉంటుందని సమాచారం. క్రిష్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ కూడా దర్శకులు, నిర్మాతలు ఎవరో ఒకరు సెట్ కి వస్తూనే ఉన్నారట. ఇటీవల హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు పవన్ ని కలుసుకొని వెళ్లారు. దిల్ రాజు అయితే తరచూ సెట్ లోనే కనిపిస్తున్నాడట. ఇలా ఇండస్ట్రీ జనాలు పవన్ ని చూడడం కోసం రావడం, వాళ్లతో పవన్ భేటీ వేయడం వలన సెట్ లో ఒకటే హడావిడిగా ఉంటుందని తెలుస్తోంది.
ఎవరొచ్చినా కూడా పవన్ వాళ్లకి సమయం కేటాయిస్తూ.. మాట్లాడి పంపిస్తున్నారట. దీంతో షూటింగ్ కి అనుకోని బ్రేకులు చాలా వస్తున్నాయని.. ఈ విషయంలో దర్శకుడు క్రిష్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం ‘విరూపాక్ష’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు దీన్నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.