టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమాలను తెరకెక్కిస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే లవ్ స్టోరీ సినిమాతో శేఖర్ కమ్ముల ప్రేక్షకులను ఆలోచింపజేశారు. ఈ సినిమాకు మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. అయితే క్లైమాక్స్ విషయంలో మాత్రం ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకులు లవ్ స్టోరీ క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెబుతుంటే మరి కొందరు మాత్రం లవ్ స్టోరీ క్లైమాక్స్ వేరే విధంగా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం క్లైమాక్స్ ను ఏకంగా ఐదుసార్లు షూట్ చేశారని తెలుస్తోంది. సినిమా పర్ఫెక్ట్ గా రావాలనే ఉద్దేశంతో రిలీజ్ కు కొన్నిరోజుల ముందు సైతం శేఖర్ కమ్ముల రీ షూట్లు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమాలో చూస్తున్న క్లైమాక్స్ లవ్ స్టోరీ 5వ వెర్షన్ అని సమాచారం. సాయిపల్లవి అమ్మమ్మకు చెప్పు చూపించే సీన్ ను తాజాగా షూట్ చేశారని తెలుస్తోంది.
ఫిదా తర్వాత మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని శేఖర్ కమ్ముల స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. లవ్ స్టోరీ ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగచైతన్య కెరీర్ లో లవ్ స్టోరీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.