శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టొరీ సినిమా అనేక అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ ఆడియోతో ఈ చిత్రం ఇప్పటికే జనాల్లో చాలా హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా వ్యాపారం కొంత మేరకు సవరించబడింది. ఏదేమైనా ఈ సినిమా మొత్తంగా నాగ చైతన్య శేఖర్ కమ్ముల కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.
మోస్ట్ అవైటింగ్ మూవీ లవ్ స్టోరీ 32.8Cr వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బిజినెస్ కు తగ్గట్టుగా మొదటి వారం కలెక్షన్స్ కూడా గట్టిగానే వస్తాయని అర్థమవుతోంది ఎందుకంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కొన్ని ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రాలో చిత్ర నిర్మాణ సంస్థ ఏషియన్ గ్రూప్స్ 16 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ తో సొంతంగా విడుదల చేస్తుండగా ఆంధ్రలో సినిమా 16.8 కోట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఇక ముఖ్యంగా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 33 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోగలిగితే థియేట్రికల్ గా హిట్ అయినట్లు లెక్క.ఇక మిగతా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 50 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సమాచారం.