Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Advertisement

అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రూపొందిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించారు. 2020 సమ్మర్లో రావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

4 Years For Love Story

దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే 2021 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లకు వచ్చి బాగా చూశారు. టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఒకసారి ‘లవ్ స్టోరీ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 12.62 cr
సీడెడ్  4.50 cr
ఉత్తరాంధ్ర  3.15 cr
ఈస్ట్  1.74 cr
వెస్ట్  1.48 cr
గుంటూరు  1.59 cr
కృష్ణా  1.50 cr
నెల్లూరు  0.94 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  27.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   2.54 Cr
  ఓవర్సీస్   5.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  35.16 cr

‘లవ్ స్టోరీ’ చిత్రం రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.35.16 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా ఈ సినిమా రూ.3.16 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి సూపర్ హిట్ గా నిలిచింది. జనాలు థియేటర్లకు రావడం తగ్గించేసిన టైంలో, అదీ టికెట్ రేట్లు బాగా తక్కువగా ఉన్న టైంలో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.

‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus