OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు పెరగడానికి.. సినిమా కచ్చితంగా ఆడియన్స్ చూడాలని తాపత్రయ పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

OG

1) డౌట్ లేకుండా ఫస్ట్ రీజన్ పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్ లే ఉన్నాయి. ‘వకీల్ సాబ్’ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ కి రీమేక్. ‘భీమ్లా నాయక్’ మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి రీమేక్. ‘బ్రో’ తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్. ఇప్పుడు చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తమిళంలో హిట్ అయిన ‘తేరి’ కి రీమేక్.పైగా అది తెలుగులో ‘పోలీస్’ గా డబ్ అయ్యింది కూడా..! ‘హరిహర వీరమల్లు’ స్ట్రైట్ మూవీ అయినప్పటికీ క్రిష్ అందించిన ఒరిజినల్ కథ బాగా డిస్టర్బ్ అయ్యింది. ఫలితం సంగతి కూడా అందరికీ తెలిసిందే. అందుకే ‘ఓజి’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కటానా ట్రైనర్ గా అలాగే గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు.

2) 2వ కారణం దర్శకుడు సుజిత్. ఈ కుర్ర డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే.. మేకింగ్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ లోనే తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేశాడు. 2వ సినిమాని ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో చేసే ఛాన్స్ అందుకున్నాడు. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని పొరపాట్లు చేసినా.. మేకింగ్ విషయంలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా తెరకెక్కించాడు అనే చెప్పాలి. ‘సాహో’ చూసిన తర్వాత తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పిలిచి మరీ ‘ఓజి’ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

3) ఇక మూడవ రీజన్ నిర్మాత డివివి దానయ్య. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ నుండి ఒక సినిమా వస్తుంది అంటే అది మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. నిర్మాత దానయ్య ఖర్చుకి వెనకాడకుండా ‘ఓజి’ ని రూపొందించాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ స్థాయిలో ‘ఓజి’ హిట్ అవుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు దానయ్య.

4) ‘ఓజి’ కి హైప్ పెంచడంలో సంగీత దర్శకుడు తమన్ కృషి కూడా చాలా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ విషయంలో ఎంత బెస్ట్ ఇవ్వాలో.. అంత బెస్ట్ ఇచ్చినట్టు టీజర్, ట్రైలర్, సాంగ్స్ చెబుతున్నాయి. కచ్చితంగా ‘ఓజి’ కి తమన్ అందించిన ఆర్.ఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని అంటున్నారు చూడాలి.

5)’ఓజి’ లో విలన్ రోల్ కూడా చాలా కీలకం అని అంటున్నారు. బాలీవుడ్ టాప్ హీరో అయినటువంటి ఇమ్రాన్ హష్మీ ‘ఓజి’ లో ఓమి అనే మెయిన్ విలన్ గా నటించాడు. ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ సీన్స్ కే ఫేమస్ అని ఎక్కువ మంది చెప్పేవారు. కానీ ‘ఓజి’ లో ఇతను కూడా యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్లు తెలుస్తుంది.

6) తమిళ హీరోయిన్ శ్రియ రెడ్డి కూడా ‘ఓజి’ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందట. ఆమె రోల్ కూడా సినిమాకి హైలెట్ అని అంటున్నారు.

7) హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్ యూత్ ని అలరిస్తాయి అని అంటున్నారు. కాకపోతే సినిమాలో ఈమె పాత్రకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.

8) ‘డిజె టిల్లు’ బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ రోల్లో కనిపిస్తుందట. ఆమె పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.

9) ‘ఓజి’ గ్లింప్స్ ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కూడా ఒకటి. సినిమాలో కూడా అతని యాక్టింగ్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.

10) రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస వంటి ఇద్దరు స్టార్ సినిమాటోగ్రాఫర్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. వాళ్ళ పనితనం సినిమాకి మరింత రిచ్ నెస్ తీసుకొచ్చింది అని అంటున్నారు.

 ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus