దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదలైన ఈ సినిమాకి అక్టోబర్ 30 నైట్ నుండి ప్రీమియర్స్ వేశారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి వీకెండ్ ను అద్భుతంగా క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది.
Lucky Baskhar Collections:
మొదటి సోమవారం కూడా డీసెంట్ గా కలెక్ట్ చేసింది. కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో కూడా ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి (Lucky Baskhar) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 5 రోజుల్లో రూ.13.29 కోట్ల షేర్ ను రాబట్టి రూ.1.79 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.25.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.