దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar) .’సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకుడు. జి.వి.ప్రకాష్ (G. V. Prakash Kumar) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘శ్రీమతి గారు’ అనే పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్, ట్రైలర్స్ కూడా ఆడియన్స్ కి మంచి హోప్స్ ఇచ్చాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ వంటి వివరాలు ఒక లుక్కేద్దాం రండి :
నైజాం | 2.50 cr |
సీడెడ్ | 0.60 cr |
ఆంధ్ర(టోటల్) | 2.80 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.10 cr |
ఓవర్సీస్ | 3.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 11.00 cr |
‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. దుల్కర్ గత చిత్రం ‘సీతా రామం’ కి రూ.20 కోట్ల పైనే షేర్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి.. ‘లక్కీ భాస్కర్’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. పెయిడ్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూడాలి మరి.