బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మానస్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే మానస్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మానస్ తన నిశ్చితార్థ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
శ్రీజ అనే అమ్మాయితో ఈయన నిశ్చితార్థపు వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇది పెద్దలకు వివాహం కావటం విశేషం. ఇకపోతే మరికొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నటువంటి మానస్ తన పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బంధువులందరికీ కూడా ఇన్విటేషన్స్ అందిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి అమర్ కోసం ఈయన బిగ్ బాస్ వేదికపైకి అమర్ తల్లితో కలిసి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వేదికపై సందడి చేసినటువంటి మానస్ తన స్నేహితుడు సలహాలు సూచనలు కూడా చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున గారిని కలిసినటువంటి ఈయన తన తల్లిదండ్రులతో పాటు వెళ్లి నాగార్జున గారికి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారని తెలుస్తుంది.
ఇలా నాగార్జున గారికి స్వీట్ బాక్స్ తో పాటు ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చి తన పెళ్లికి రావాలని కోరగా నాగార్జున గారు కూడా తనని ఆశీర్వదించి విషెస్ తెలియజేశారు అంటూ మానస్ తల్లి పద్మిని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మానస్ (Maanas) ఈ నెల 22వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!