నితిన్- కృతి శెట్టి జంటగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం ఆగస్టు 12న విడుదలయ్యి నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. డెబ్యూ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ఇది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. రొమాంటిక్,కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో… ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.పోటీగా 3 హిట్టు సినిమాలు ఉండటంతో .. వాటి ముందు ‘మాచర్ల నియోజకవర్గం’ నిలబడలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 3.22 cr |
సీడెడ్ | 1.50 cr |
ఉత్తరాంధ్ర | 1.31 cr |
ఈస్ట్ | 0.83 cr |
వెస్ట్ | 0.40 cr |
గుంటూరు | 0.92 cr |
కృష్ణా | 0.70 cr |
నెల్లూరు | 0.44 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.32 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr |
ఓవర్సీస్ | 0.42 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.24 cr |
‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.24 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.సో బయ్యర్లకు ఈ మూవీ మొత్తంగా రూ.8.76 కోట్ల నష్టాలను మిగిల్చింది.
బింబిసార, సీతా రామం, కార్తికేయ వంటి చిత్రాలు సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయినట్టు స్పష్టమవుతుంది. ఫైనల్ గా ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ‘భీష్మ’ తర్వాత నితిన్ నటించిన ‘చెక్’ డిజాస్టర్ కాగా, ‘రంగ్ దే’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక ‘మాస్ట్రో’ ఓటీటీకి వెళ్లి సేఫ్ అవ్వగా, ‘మాచర్ల’ తో నితిన్ కు మరో డిజాస్టర్ పడినట్టు అయ్యింది.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర