Mad Square First Review: ఉగాది విన్నర్ ‘మ్యాడ్ స్క్వేర్’ అవుతుందా?

‘ఉగాది’ ‘రంజాన్’ పండుగలను పురస్కరించుకుని 4,5 క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square)  ఒకటి. 2023 లో వచ్చిన ‘మ్యాడ్’ (MAD) యూత్ ను అలరించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ‘లడ్డు గాని పెళ్లి’ ‘స్వాతి రెడ్డి’ వంటి పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

Mad Square First Review:

భీమ్స్ (Bheems Ceciroleo) ఈ సినిమాకి సంగీతం అందించారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ తో (S.S.Thaman) చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ ఫైనల్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదు అంటూ.. నిన్న, మొన్నటి వరకు టాక్ నడిచింది. ఓ ప్రెస్ మీట్లో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) కూడా ‘ఇండియన్ కాపీ ఇంకా సబ్మిట్ చేయలేదు’ అంటూ చెప్పడంతో ఈ కామెంట్స్ ఇంకా ఎక్కువయ్యాయి. మొత్తానికి ‘మ్యాడ్ స్క్వేర్’ ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి.

నిన్న నైట్ కొంతమందికి నాగవంశీ స్పెషల్ షో వేసి చూపించడం కూడా జరిగింది. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా సాగుతుందట. బ్యాక్ టు బ్యాక్ పంచులతో యూత్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా కూడా ఫస్ట్ హాఫ్ ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ వద్ద వచ్చే చిన్న ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తి రేకెత్తిస్తుందట.

ఇక సెకండాఫ్ లో వచ్చే గోవా ఎపిసోడ్.. యూత్ ని ఆకట్టుకుంటుందట. పాటలు చూడటానికి కూడా బాగా పిక్చరైజ్ చేసినట్టు తెలుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ‘భాయ్’ సీక్వెన్స్ నుండి చాలా మీమ్ కంటెంట్ తీసుకునే విధంగా ఉందని అంటున్నారు. మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ వీకెండ్ థియేటర్లలో నవ్వించే సినిమా అని చెబుతున్నారు. మరి థియేటర్ల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus