Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు,నిర్మాత అయినటువంటి రాజ్ నిడుమోరుని సమంత పెళ్లాడింది. చాలా కాలంగా వీళ్ళ ఎఫైర్ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటూ వచ్చాయి. అందువల్ల ఫైనల్ గా ‘సమంత.. సింపతీ డ్రామాతో అనుకున్నది సాధించింది’ అంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజెన్లు అలాగే నాగ చైతన్య అభిమానులు.

Maadhavi Latha

అలాగే సమంత మేకప్ ఆర్టిస్ట్ అలాగే హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా సమంత రెండో పెళ్లి గురించి పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ క్రమంలో సమంతకి మద్దతుగా సీనియర్ నటి హేమ నిలబడి ఆమెను వెనకేసుకొచ్చింది. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ మాధవీలత కూడా చేరింది.తన ఫేస్బుక్ ద్వారా మాధవీలత ఈ విషయం పై స్పందిస్తూ.. “సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకేంటో బాధ మరి.

వీళ్ళెవ్వరూ ఏ సంసారాన్ని కూల్చలేదు అన్నట్టు. ఆమె సంసారాలు కూల్చడం వీళ్ళు చూశారు మరి. అన్నట్టు ఇలా కామెంట్స్ చేసేవాళ్ళు మీకు కూడా చాలా రిలేషన్స్ ఉండి ఇంకొకడి సంసారాన్ని కూల్చి..పెళ్లి చేసుకోవాలనుకున్నారుగా.,! ఓ ఆడు తెలివిగా తప్పించుకున్నాడు కదా. ఆడి పెళ్ళాంకి విడాకులు ఇవ్వకుండా.. మిమ్మల్ని పెళ్లిచేసుకోకుండా.. సో మీ జీవితంలో అది జరగలేదు కాబట్టి.. ఇంకొకరి జీవితంలో అలా జరిగిందని ఊహించుకుంటూ.. కామెంట్లు చేస్తారు.

ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయ్. ఎవరికి ఎప్పుడు రాసుంటే.. అప్పుడు కలిసుంటారు. ఎవరికి రుణాలు తీరిపోతే వాళ్ళు విడిపోతారు. ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా..! సంతోషించండి. మీరేం అంత పత్తిత్తులు కాదు కానీ.. మీ గురించి నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.

నేనేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి.. నా పేరెంట్స్ ని నేను అస్సలు పట్టించుకోను

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus