బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ఇండిపెండెంట్ సినిమాలతో పాపులర్ అయ్యారు. త్వరలో రాబోతున్న సుమ కనకాల ‘మోగ్లీ’ సినిమాలో ఇతను విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్ లో ఇతనే హైలెట్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల అతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
బండి సరోజ్ మాట్లాడుతూ.. “నేను అందంగా ఉంటాను కదా.. ఎవరో ఒకరు నన్ను హీరోని చేయకపోతారా? అని నేను చిన్నప్పటి నుండి ఆశపడేవాడిని. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి అంతే. అందుకే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట డైరెక్టర్ అయ్యి సక్సెస్ అయితే తర్వాత హీరోగా మారొచ్చులే అనుకున్నాను. అందుకే మార్కెట్ ఉన్న హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నించాను.
కానీ వర్కౌట్ కాలేదు. అందుకే నేనే హీరోగా మారాను.కరెక్ట్ గా అప్పటినుండే నేను సక్సెస్ అయ్యాను అని అనుకుంటాను. అదే నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని భావిస్తుంటాను. నా పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ కి దూరంగా ఉంచడానికి ఎక్కువ ఇష్టపడతాను.మా పేరెంట్స్ తో ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ గురించి నేను ఆలోచించడం లేదు. నా గురించి వాళ్లు ఆలోచించాలని నేను అనుకోను.
చిన్నప్పటి నుండి ఇలాగే ఉండేవాడిని. ‘నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి? రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది కదా?’ అని నాకు అనిపిస్తుండేది.ఇప్పుడైతే నేను సినిమాతో మాత్రమే టచ్ లో ఉన్నాను. అది తప్ప నాకు వేరే ధ్యాస లేదు” అంటూ బోల్డ్ గా చెప్పుకొచ్చాడు.