నేటితో అమెరికాలో 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేయనున్న మహానటి

  • May 17, 2018 / 11:23 AM IST

అభినేత్రి సావిత్రి జీవితంపై నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ  మే 9న రిలీజ్ అయి అందరి మనసులు దోచుకుంటోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. సావిత్రిగా కీర్తి సురేష్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ లు మెస్మరైజ్ చేశారు. సమంత, విజయ్ దేవరకొండ లు పరిధి మేరకు మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, నరేష్, క్రిష్, అవసరాల శ్రీనివాస్ వంటి ఎంతోమంది నటీనటులు నటించిన ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 19.62 కోట్ల షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో 10.52 కోట్ల షేర్ వసూలు చేసింది. అమెరికాలో బుధవారం నాటికీ 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈరోజుతో రెండు మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేయనుందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు స్పష్టం చేశారు. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా మహానటి కలక్షన్స్ ఉంటున్నాయి. పైగా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఆకట్టుకోకపోవడంతో ఈ చిత్రానికి వసూళ్లు పెరుగుతున్నాయి.  ఈ సినిమా విజయం ఎంతోమందికి ఉత్సాహాన్నిచ్చింది. దీంతో శ్రీదేవి, జయలలిత, ఉదయ్ కిరణ్ బయోపిక్ కోసం దర్శకనిర్మాతలు స్క్రిప్ట్ పనులు మొదలెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus