మహానటిలో సావిత్రి జీవితం ప్రతిభింబిస్తుంది – స్వప్న దత్

  • April 27, 2018 / 09:48 AM IST

“ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్

మహానటి సావిత్రి జీవితంపై సినిమాను తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన స్వప్నదత్ అనేక విషయాలను చెప్పారు. “సావిత్రి రోల్ కోసం అనేకమందిని పరిశీలించాము. అయితే ఓ రోజు కీర్తి సురేష్ తమిళంలో నటించిన పాట టీవీలో చూసి నాగ్ అశ్విన్ ఆమెను సెలక్ట్ చేశారు. అప్పటినుంచి కీర్తి.. సావిత్రి నటించిన అనేక సినిమాలు చూసింది.

ఆమె తల్లి కూడా కీర్తికి చాలా సహకరించింది” అని వివరించారు. స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ ” సావిత్రి స్క్రిప్ట్ కోసం సంవత్సరం పాటు రీసెర్చ్ చేసాం. అనేక పుస్తకాలు చదివాము. సావిత్రితో పరిచయమున్న ఎంతోమందిని అడిగి తెలుసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసాం. ఈ స్క్రిప్ట్ చూసి సావిత్రి కుమార్తె చాలా సంతోషించింది” అని స్వప్న వివరించింది. “అంతేకాదు ఈ సినిమాలో సావిత్రి సినీ జీవితమే కాదు.. వ్యక్తిగత జీవితం.. ఆమె మంచి తనం ఒక్క మాటలతో చెప్పాలంటే ఆమె జీవితాన్ని కళ్ళకు కట్టనున్నాం” అని తెలిపారు. మహానటిలో క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ గా సావిత్రి జీవితాన్ని మనకి చూపించనుంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా కూడా అందరి మనసులు గెలుచుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus