మహేశ్ బాబు.. లండన్ రిటర్న్స్

  • April 5, 2017 / 01:15 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్ లో కొరటాల శివతో స్టోరీ డిస్కషన్ పూర్తి చేశారు. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో లండన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చిన ఎన్నారైగా మహేశ్ బాబు కనిపించనున్నారు.  కాబట్టి ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగ్ లండన్ లో జరగనుంది. మే నెల మొత్తం లండన్ లో సీన్లు పూర్తి చేయాలని కొరటాల శివ ప్లాన్ చేశారు. అక్కడ చిత్రీకరణ  పూర్తయిన తర్వాత, హైదరాబాద్ లో  షూటింగ్ ఉంటుందని సమాచారం.

కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో వీరి కలయికలో రానున్న రెండో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ కి “భరత్ అను నేను” అనే పేరుని ఖరారు చేసినట్లు దేవీ శ్రీ ప్రసాద్ ఖరారు చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus