చీకట్లో మహేష్ సందడి..!!

బ్రహ్మోత్సం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ డైరక్టర్ మురుగదాస్ తో సినిమా చేస్తున్నారు. టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ గత నెల 29 న ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన మురికివాడల సెట్ లో మొదటి రెండు రోజుల పాటు పగటి పూట షూటింగ్ చేయగా, ప్రస్తుతం రాత్రివేళ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ నైట్ ఎఫెక్ట్ సీన్లను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఇంకా వారం పాటు ఇక్కడే షూటింగ్ ఉంటుందని తెలిపింది. న్యాయ వ్యవస్థపై సైటెర్ గా సాగే కథ తో యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈమె చిత్ర బృందంతో ఆగస్టు 11 నుంచి కలవనుంది.  హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన వెంటనే మురుగదాస్ టీమ్ చైన్నైకి పయనం కానుంది. అక్కడ పరిసరాలతో పాటు ముంబై, పూణే ల్లో నెల రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేయనున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవాంతరాలు లేకుండా షూటింగ్ సాగితే సంక్రాంతి బరిలో మహేష్ కూడా ఉండవచ్చని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus